రికార్డులు నమోద చేసిన కేఎల్ రాహుల్

Historic Feat: ఇంగ్లాండ్ పర్యటనలో కెఎల్ రాహుల్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. అనుభవజ్ఞుడైన ఆటగాడిగా, జట్టుకు అవసరమైనప్పుడల్లా రాహుల్ తన వంతు సహకారం అందించాడు. అయితే, ఓవల్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్ పెద్ద స్కోరు సాధించడంలో విఫలమయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో 40 బంతులు ఎదుర్కొన్న రాహుల్ కేవలం 14 పరుగులకే ఔటయ్యాడు.

రాహుల్ తొలి ఇన్నింగ్స్‌లో పెద్దగా ఇన్నింగ్స్ ఆడకపోవచ్చు. కానీ రాహుల్ ఓ రికార్డు సాధించాడు. విదేశీ టెస్ట్ సిరీస్‌లో 1000 కంటే ఎక్కువ బంతులు ఎదుర్కొన్న మూడవ భారత ఓపెనర్‌గా నిలిచాడు. దీంతో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న భారత బ్యాట్స్ మెన్ జాబితాలో రాహుల్ విరాట్ కోహ్లీని అధిగమించాడు. ప్రస్తుతం జరుగుతున్న టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో కెఎల్ రాహుల్ ఇప్పటివరకు 1038 బంతులు ఎదుర్కొన్నాడు.

ఇంగ్లాండ్ పర్యటనలో ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న భారత ఆటగాళ్ల జాబితాలో రాహుల్ ద్రవిడ్ అగ్రస్థానంలో ఉన్నాడు. ది వాల్ గా ప్రసిద్ధి చెందిన రాహుల్, 2002 ఇంగ్లాండ్ పర్యటనలో అత్యధికంగా 1336 బంతులు ఎదుర్కొన్ని బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. అదనంగా కేఎ రాహుల్ 2 సెంచరీ ఇన్నింగ్స్‌లు సాధించగలిగాడు. ఈ పర్యటనలో ఇప్పటివరకు 500 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఇంకా, ఈ టెస్ట్ సిరీస్‌లో అతను మొత్తం 1038 బంతులను ఎదుర్కొన్నాడు. తొలిసారిగా, రాహుల్ ఒక టెస్ట్ సిరీస్‌లో ఈ మూడు ఘనతలను ఒకేసారి సాధించగలిగాడు.

అదేవిధంగా, భారత ఓపెనర్‌గా ఇంగ్లాండ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గవాస్కర్ రికార్డును రాహుల్ బద్దలు కొట్టడానికి దగ్గరగా ఉన్నాడు. ఇంగ్లాండ్‌లో ఓపెనర్‌గా రాహుల్ 13 టెస్ట్ మ్యాచ్‌ల్లో 1122 పరుగులు చేశాడు. ప్రస్తుతం జాబితాలో అగ్రస్థానంలో ఉన్న సునీల్ గవాస్కర్ ఇంగ్లాండ్‌లో 15 టెస్ట్ మ్యాచ్‌ల్లో మొత్తం 1152 పరుగులు చేశాడు. ఓవల్ టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో రాహుల్ కేవలం 31 పరుగులు చేస్తే, అతను గవాస్కర్ రికార్డును బద్దలు కొడతాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story