Virat Kohli: కింగ్ ఈజ్ ఆల్వేస్ కింగ్.. రికార్డులు విరాట్ కోహ్లీ వెనక పరిగెడతాయో, లేక కోహ్లీనే రికార్డుల వేట సాగిస్తాడో తెలియదు కానీ.. ఐపీఎల్ చరిత్రలో రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మరో అద్భుతమైన, అరుదైన మైలురాయిని అందుకున్నాడు. గుజరాత్‌తో జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో కోహ్లీ బ్యాట్ సరికొత్త చరిత్రకు వేదికైంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కేవలం 43 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు.. కానీ, ఆ 43 పరుగులతోనే ఐపీఎల్ ప్రపంచంలో మరెవరికీ సాధ్యం కాని సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ ఇన్నింగ్స్‌తో విరాట్ కోహ్లీ వరుసగా నాలుగు ఐపీఎల్ సీజన్లలో ఆరు వందలకు పైగా పరుగులు (600+ Runs) సాధించిన ఏకైక బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే.. విరాట్ కోహ్లీ కంటే ముందు కొందరు దిగ్గజాలు ఈ ఫీట్‌కు దరిదాపుల్లోకి వచ్చారు. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్, అలాగే టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్‌లు వరుసగా మూడు సీజన్లలో ఆరు వందలకు పైగా పరుగులు సాధించి రికార్డు సృష్టించారు. ఇక ఆస్ట్రేలియా డైనమైట్ డేవిడ్ వార్నర్ వరుసగా రెండు సీజన్లలో ఈ ఘనత సాధించాడు. కానీ, ఇప్పుడు వీరందరి రికార్డులను బద్దలు కొడుతూ.. ఎవరికీ అందనంత ఎత్తులో, వరుసగా నాలుగు సీజన్లలో ఆరు వందల మార్క్‌ను దాటి టాప్‌లో నిలిచాడు విరాట్ కోహ్లీ.

ఈ రికార్డు కేవలం విరాట్ కోహ్లీ క్లాస్‌ను మాత్రమే కాదు.. అతని అంకితభావాన్ని, ఫిట్‌నెస్‌ను, గేమ్ పట్ల ఉన్న ఫ్యాషన్‌ను ప్రపంచానికి చాటి చెబుతోంది. ఒకవైపు యంగ్ జనరేషన్ క్రికెటర్లు మెరుపులు మెరిపిస్తున్నా.. లీగ్‌లో ఇప్పటికీ తానే బాస్ అని కింగ్ కోహ్లీ నిరూపిస్తూనే ఉన్నాడు. రన్ మెషిన్ సృష్టించిన ఈ ఆల్‌టైమ్ రికార్డ్‌తో అటు ఆర్సీబీ ఫ్యాన్స్, ఇటు క్రికెట్ ప్రేమికులు పండగ చేసుకుంటున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story