Rohit Sharma Returns: హామ్‌స్ట్రింగ్ గాయంతో ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌కు రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడా లేదా అని టెన్షన్ పడ్డ ఫ్యాన్స్‌కు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న రోహిత్ శర్మ జూన్ 13 నుంచి ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కోసం ఈరోజే (జూన్ 10న) డైరెక్ట్‌గా చండీగఢ్‌లో ల్యాండ్ అయిపోయాడు.

టీమిండియాతో కలిసి ప్రాక్టీస్ స్టార్ట్ చేయడానికి రోహిత్ శర్మ ఎంట్రీ ఇవ్వడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో రోహిత్ అడుగు పెట్టాడు. భారీ సెక్యూరిటీ నడుమ బ్లాక్ పోలో షర్ట్, కళ్లకు బ్లాక్ గ్లాసెస్ పెట్టుకుని హిట్ మ్యాన్ ఫుల్ స్టైలిష్‌గా, రాయల్‌గా నడుచుకుంటూ వస్తున్న వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. నడిచేటప్పుడు రోహిత్ ఎక్కడా అసౌకర్యంగా కనిపించకపోవడంతో.. ఆయన వంద శాతం ఫిట్‌గా ఉన్నాడని కన్ఫర్మ్ అయిపోయింది.

నిజానికి.. ఈ వన్డే సిరీస్‌కు యువ సంచలనం శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. రోహిత్ శర్మ జట్టుకు వెన్నుదన్నుగా నిలవనున్నాడు. వచ్చే ఏడాది జరగబోయే వన్డే వరల్డ్ కప్‌కు ముందు టీమ్‌ను పక్కాగా సెట్ చేయడానికి.. ముల్లాన్‌పూర్‌లో ఒక స్పెషల్ ప్రిపరేషన్ క్యాంప్‌ను ప్లాన్ చేశారు. అందుకోసమే రోహిత్‌ను అర్జెంట్‌గా టీమ్‌లోకి పిలిపించారు.

ఇటీవల హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మేనేజ్‌మెంట్‌కు, కొందరు సీనియర్ ఆటగాళ్లకు మధ్య విభేదాలు నడుస్తున్నాయంటూ రూమర్స్ వస్తున్న టైమ్‌లో.. రోహిత్ శర్మ చండీగఢ్‌కు రావడం డ్రెస్సింగ్ రూమ్‌లో ప్లేయర్స్‌కు ఒక పెద్ద బూస్టింగ్ అనే చెప్పాలి. హిట్ మ్యాన్ ఎంట్రీతో ఆఫ్ఘనిస్థాన్‌తో సిరీస్‌కు టీమిండియా మరింత బలంగా తయారైంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story