మొదలు పెట్టిన హిట్ మ్యాన్

Hitman Rohit Sharma: ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉన్న టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ, తిరిగి మైదానంలోకి అడుగుపెట్టడానికి ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. కోచ్ అభిషేక్ నాయర్‌ పర్యవేక్షణలో శిక్షణ తీసుకుంటున్నాడు.

గతంలో దినేష్ కార్తీక్, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లకు మెరుగైన శిక్షణ ఇచ్చిన అభిషేక్ నాయర్‌తో రోహిత్ కలిసి శిక్షణ పొందుతున్నాడు. నాయర్, రోహిత్‌కు వ్యక్తిగత కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. రోహిత్ గత కొన్ని రోజులుగా ముంబైలోని ఒక జిమ్‌లో నాయర్‌తో కలిసి వర్కౌట్స్ చేస్తున్నాడు. ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించాడు.

రోహిత్ తన రాబోయే అంతర్జాతీయ మ్యాచ్‌ల కోసం సిద్ధమవుతున్నాడు. అతడు అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో ఆడే అవకాశం ఉంది. అదే సిరీస్‌లో విరాట్ కోహ్లీ కూడా తిరిగి జట్టులోకి రానున్నారు.

గత ఏడాది కాలంగా టెస్ట్ క్రికెట్, టీ20లకు దూరంగా ఉన్న రోహిత్, 2027 ప్రపంచకప్ వరకు వన్డేలు ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ లక్ష్యంతోనే తిరిగి కఠినమైన ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. తన ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫోటోలను రోహిత్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story