రెండోస్థానానికి రోహిత్

Rohit Climbs to Second Spot: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లోటాప్ 5 లో ముగ్గురు భారత ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు మొదటి స్థానంలో శుభ్ మన్ గిల్,రెండో స్థానంలో రోహిత్ శర్మ ,నాల్గో స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఇక పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ ఆజమ్ మూడోస్థానంలో ఉన్నాడు. బాబర్ ఆజమ్ వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో రోహిత్ శర్మ ఒక స్థానం మెరుగుపరుచుకుని రెండవ స్థానానికి చేరుకున్నాడు. ఇక బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్ రెండో ర్యాంక్ లో ఉన్నాడు.

టీ20లు, టెస్టులకు గుడ్ బై చెప్పిన రోహిత్ శర్మ చివరి సారి చాంపియన్స్ ట్రోఫీ ఆడాడు. ఇటీవల మ్యాచులేమీ ఆడకపోయినా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. తన వన్డే క్రికెటర్ కెరీర్ పై సందిగ్ధతపై ప్రచారం వస్తున్న నేపథ్యంలో రోహిత్ ర్యాంకింగ్ తో తానేంటో తెలిసిపోయింది.

ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉన్న టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ, తిరిగి మైదానంలోకి అడుగుపెట్టడానికి ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. కోచ్ అభిషేక్ నాయర్‌ పర్యవేక్షణలో శిక్షణ తీసుకుంటున్నాడు.అతడు అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో ఆడే అవకాశం ఉంది. అదే సిరీస్‌లో విరాట్ కోహ్లీ కూడా తిరిగి జట్టులోకి రానున్నారు.

ర్యాంకింగ్స్

శుభ్‌మన్ గిల్: మొదటి స్థానం (784 పాయింట్లు)

రోహిత్ శర్మ: రెండవ స్థానం (756 పాయింట్లు)

బాబర్ ఆజమ్: మూడవ స్థానం (751 పాయింట్లు)

విరాట్ కోహ్లీ: నాలుగవ స్థానం (736 పాయింట్లు)

PolitEnt Media

PolitEnt Media

Next Story