కోహ్లీ సంపాదన ఎంతంటే ?

Kohli:ఐపీఎల్ 2025 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కి ఎంతో ప్రత్యేకత.. ఎందుకంటే !17 సంవత్సరాల నిరీక్షణ తర్వాత, RCB చివరకు ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి మొదటిసారి ఐపీఎల్ ట్రోఫీని ఎగరవేసింది. ఈ గెలుపులో విరాట్ కోహ్లీ పాత్ర ఎంతో ఉంది. కోహ్లీ మైదానంలో అద్భుతంగా రాణించడమే కాకుండా, సంపాదన పరంగా కూడా అందరినీ అధిగమించాడు. ఈసారి ఐపీఎల్‌లో ఆర్‌సిబి కోహ్లీని 21 కోట్లకు నిలుపుకున్నప్పటికీ, సీజన్ ముగిసే సమయానికి, అతను 27 కోట్లకు పైగా సంపాదించాడు. ఇది ఎలా సాధ్యమైంది? వివరాలు ఇవే!

జీతం, మ్యాచ్ ఫీజు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా భారీ ఆదాయం: ఈ ఐపీఎల్ సీజన్‌లో కోహ్లీ మొత్తం రూ.27.40 కోట్లు సంపాదించాడు. ఆర్‌సిబి అతన్ని రూ.21 కోట్లకు అట్టిపెట్టుకుంది, ఇది అతని బేస్ ఫీజు. అంతేకాకుండా, ఈ సీజన్‌లో కోహ్లీ మొత్తం 15 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 13 లీగ్ మ్యాచ్‌లు, 1 క్వాలిఫయర్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ ఉన్నాయి. ఒక్కో మ్యాచ్‌కు రూ.7.5 లక్షల ఫీజు ఆధారంగా, అతను రూ.1.12 కోట్లు సంపాదించాడు.

ఇది మాత్రమే కాదు, IPL ప్రైజ్ మనీలో 30% ఆటగాళ్లకు పంపిణీ చేయబడుతుంది. RCB జట్టులో మొత్తం 22 మంది ఆటగాళ్లు ఉన్నారు, అందులో కోహ్లీ వాటా దాదాపు రూ. 27 లక్షలు. అదనంగా, విరాట్ కోహ్లీ తన బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల నుండి అదనంగా రూ. 5 కోట్లు సంపాదించాడు. మనం అన్నింటినీ కలిపితే, 2025 IPL నుండి కోహ్లీ దాదాపు రూ. 27.40 కోట్లు సంపాదించాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story