Hashim Amla: క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రశాంతమైన బ్యాటర్‌గా, రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్న దక్షిణాఫ్రికా లెజెండ్ హషీమ్ ఆమ్లా.. తాజాగా ప్రపంచ కప్‌లో తను ఎంతో ఆసక్తిగా తిలకించాలనుకుంటున్న ముగ్గురు ప్రత్యేక ఆటగాళ్ల పేర్లను వెల్లడించారు. ఆధునిక క్రికెట్‌ను శాసిస్తున్న ఆ దిగ్గజం ఎంచుకున్న ఆ ముగ్గురు ప్లేయర్లు ఎవరో తెలుసుకుందాం.

ఈ జాబితాలో మొదటి స్థానంలో భారతక్ కెప్టెన్, రికార్డుల రారాజు 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మ నిలిచాడు. మైదానంలో రోహిత్ షాట్లు ఆడే తీరు, బౌలర్లపై అతను చూపించే ఆధిపత్యం తనను ఎంతగానో ఆకట్టుకుంటాయని ఆమ్లా పేర్కొన్నారు. ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగల సత్తా రోహిత్ సొంతమని, ప్రపంచ కప్ వేదికపై రోహిత్ బ్యాటింగ్ చూడటం ఒక కంటికి నిండులైన విందని ఆమ్లా ప్రశంసించారు.

ఇక రెండో ఆటగాడిగా ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను ఆమ్లా ఎంపిక చేశారు. ఒత్తిడి ఎక్కువుగా ఉండే ఐసీసీ టోర్నమెంట్లు, నాకౌట్ మ్యాచ్‌లలో హెడ్ చెలరేగే తీరు అద్భుతమన్నారు. ఏ దశలోనైనా ప్రత్యర్థి బౌలింగ్ దాడిని చిత్తు చేస్తూ, మ్యాచ్ ను గెలిపించే అతని దూకుడు శైలి అంటే తనకు ఎంతో ఇష్టమని హషీమ్ ఆమ్లా వెల్లడించారు.

జాబితాలో మూడో, ఆశ్చర్యకరమైన పేరు.. దక్షిణాఫ్రికా యువ సంచలనం, 'బేబీ ఏబీ'గా పేరుగాంచిన డెవాల్డ్ బ్రెవిస్! ఆధునిక టీ20 , వన్డే క్రికెట్‌కు సరిపోయే సరికొత్త షాట్లతో బ్రెవిస్ ఆడే విధానం భవిష్యత్తు క్రికెట్ ముఖచిత్రాన్ని మార్చేస్తుందని ఆమ్లా అభిప్రాయపడ్డారు. ప్రపంచ కప్ వేదికపై ఈ యువ టాలెంట్ ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలని తను ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story