ముందు చనిపోవాలనుకున్నా

Deepak Yadav: హర్యానాలోని గురుగ్రామ్ జిల్లాలో మహిళా టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ హత్య ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే..ఈ కేసులో అరెస్టైన ఆమె తండ్రి దీపక్‌ యాదవ్‌ కీలక విషయాలు వెల్లడించాడు. కుమార్తెను కంట్రోల్‌లో పెట్టలేకపోతున్నావంటూ గ్రామస్థులు కొన్ని రోజుల క్రితమే నన్ను విమర్శించారు. ఈ విషయం నా కూతురికి చెబితే రూ.2 కోట్లు ఖర్చు చేసి కెరీర్‌ను వదులుకోమని చెప్పడం సమంజసం కాదని బదులిచ్చింది. దీంతో నేను ముందు చనిపోవడానికి ప్రయత్నించా అని విచారణలో దీపక్ యాదవ్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు .

జూలై 10, 2025న గురుగ్రామ్‌లోని తన నివాసంలో ఆమె తండ్రి దీపక్ యాదవ్ కాల్చి చంపాడు. తన కుమార్తె ఆమె టెన్నిస్ అకాడమీ నడపడం, ఆమె ఆదాయంపై ఆదారపడుతున్నవని గ్రామస్థుల ఎగతాళి మాటలు తట్టుకోలేక ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆమె తండ్రి పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు.

రాధికా యాదవ్ జాతీయ,అంతర్జాతీయ స్థాయిల్లో టెన్నిస్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు.హర్యానా మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్నారు. ఆమె గాయం కారణంగా కొంతకాలం ఆట నుండి దూరమైన తర్వాత టెన్నిస్ అకాడమీని ప్రారంభించి యువ క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story