ఫైనల్ మ్యాచ్ లో అభిషేక్ డౌటేనా.?

ICC Men's T20 World Cup Final: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ రేపు ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ vs న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఈ కీలక మ్యాచ్‌లో అభిషేక్ శర్మ తుది జట్టులో ఉంటారా లేదా అనే దానిపై క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది.

​ఈ వరల్డ్ కప్‌లో అభిషేక్ శర్మ ఆశించిన రీతిలో రాణించలేకపోయారు. గత 7 మ్యాచ్‌ల్లో ఆయన స్కోర్లు 0, 0, 0, 15, 55 (జింబాబ్వేపై), 10.9. ఆయన సగటు కేవలం 12.71 మాత్రమే.

టోర్నీ ప్రారంభంలో వరుసగా మూడు సార్లు సున్నాకే అవుట్ అవ్వడం ఆయన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది.

అనిల్ కుంబ్లే, అశ్విన్ వంటి సీనియర్లు అభిషేక్ శర్మ బ్యాటింగ్ తీరుపై పెదవి విరిచారు. ముఖ్యంగా సెమీ-ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై ఆయన ఆడిన షాట్ సెలక్షన్‌ను "హెడ్‌లెస్ బ్యాటింగ్" అని అశ్విన్ విమర్శించారు.

​ ఫైనల్ వంటి హై-ప్రెజర్ మ్యాచ్‌లో నిలకడగా ఆడే ప్లేయర్ అవసరమని, ఫామ్ లేని అభిషేక్ శర్మ స్థానంలో ఫినిషర్ రింకూ సింగ్ను తీసుకోవాలని చర్చ జరుగుతోంది. రింకూ వస్తే సంజూ శాంసన్ ఓపెనింగ్‌కు వెళ్లే అవకాశం ఉంది.

బౌలింగ్‌లో కూడా వరుణ్ చక్రవర్తి స్థానంలో అనుభవజ్ఞుడైన కులదీప్ యాదవ్‌ను తీసుకునే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story