ICC Men's T20 World Cup: ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగిన టీ20 ప్రపంచ కప్ రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై భారత్ అద్భుత విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇండియా 7 వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసింది.భారత బ్యాటింగ్ లో ఓపెనర్‌గా వచ్చిన సంజు శాంసన్ కేవలం 42 బంతుల్లో 89 పరుగులు (7 సిక్సర్లు, 8 ఫోర్లు) చేసి భారత్ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.భారత్ చేసిన 253 పరుగులు టీ20 ప్రపంచ కప్ నాకౌట్ చరిత్రలోనే అత్యధిక స్కోరుగా నమోదైంది.

టార్గెట్ బరిలో ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 246 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ యువ బ్యాటర్ జాకబ్ బెథెల్ (105 పరుగులు) సెంచరీతో భారత్‌ను గట్టిగా భయపెట్టాడు, కానీ భారత బౌలర్లు చివరి ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి విజయాన్ని అందించారు. జస్ప్రీత్ బుమ్రా (1/33), హార్దిక్ పాండ్యా (2/38) కీలక సమయాల్లో వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను కట్టడి చేశారు.

గతంలో 2024 టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో కూడా భారత్ ఇంగ్లాండ్‌ను 68 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు వెళ్లి ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 2026లో కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేస్తూ భారత్ ఫైనల్‌కు చేరింది.ఆదివారం జరగబోయే ఫైనల్ మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్‌తో తలపడనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story