ICC Men's T20 World Cup Semifinal: ఇండియా, ఇంగ్లండ్ మధ్య గురువారం జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్, డిజిటల్ స్పోర్ట్స్ వ్యూయర్‌షిప్‌లో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ మ్యాచ్‌ను జియో సినిమా (లేదా డిస్నీ+ హాట్‌స్టార్) లో ఏకకాలంలో 65.2 మిలియన్ల మంది వీక్షించారని ఐసీసీ వెల్లడించింది.

ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఏ లైవ్ ఈవెంట్‌కూ ఈ స్థాయి వ్యూయర్‌షిప్ నమోదు కాలేదు.

రెండో సెమీస్ డిజిటల్ వీక్షకుల సంఖ్య వరల్డ్ రికార్డును నమోదు చేసింది. ఇండియా-ఇంగ్లండ్ మ్యాచ్‌ను గరిష్టంగా 65.2 మిలియన్ల మంది చూశారు. ప్రపంచవ్యాప్తంగా మరే ఇతర మ్యాచ్‌కూ ఇంత వ్యూయర్‌షిప్ రాలేదు. టాప్ గ్లోబల్ క్రికెట్ ఈవెంట్లకు భారీ సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షించే సత్తా ఉందని మరోసారి నిరూపితమైంది. టోర్నీ నిర్వాహకులకు, బ్రాడ్కాస్ట్ పార్ట్‌నర్లకు కృతజ్ఞతలు. ఐసీసీలో మా టీమ్ కూడా ఎంతో అద్భుతంగా పనిచేసింది అని ఐసీసీ చైర్మన్ జై షా వెల్లడించారు.

Next Story