ఇలా అయితే కష్టమే.!

ICC ODI Rankings: ఇంగ్లాండ్ క్రికెట్ మెన్స్ జట్టు పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది. వన్డే ర్యాంకింగ్స్ లో ఈ టీం చాలా వెనుకబడిపోయింది.చివరకు అఘ్గనిస్తాన్ కంటే వెనుకంజలో ఉంది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ప్రస్తుత ర్యాంకింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 8వ స్థానంలో ఉంది. ఇలాగే కొనసాగితే వచ్చే 2027 వరల్డ్ కప్ కు ఎంట్రీకి కష్టంగా మారే అవకాశం ఉంది. అథిధ్య జట్లతో పాటు ఐసీసీ ర్యాంకింగ్స్లో టాప్ 8 లో ఉన్న జట్లే నేరుగా వరల్డ్ కప్ కు ఎంట్రీ సాధిస్తాయి. లేకపోతే క్వాలిఫయర్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంటది.

2027 వన్డే వరల్డ్ కప్ దక్షిణ ఆఫ్రికా, నమీబియా,జింబాబ్వేలో జరగనుంది. మొత్తం 14 జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొంటాయి. టోర్నమెంట్ అక్టోబర్ 2027లో ప్రారంభమై నవంబర్ 2027లో ముగియనుంది. ఇటీవలి టోర్నమెంట్లలో ఇంగ్లాండ్ ప్రదర్శన కొంత నిలకడగా లేకపోవడం వల్ల ర్యాంకింగ్స్ లో ఒక స్థానం పడిపోయింది. అయితే రాబోయే సిరీస్ లలో ప్రదర్శన మెరుగైతే తిరిగి టాప్ 4లోకి వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుత టాప్ 10 ఐసీసీ వన్డే జట్లు:

ఇండియా

న్యూజిలాండ్

ఆస్ట్రేలియా

శ్రీలంక

పాకిస్తాన్

సౌత్ ఆఫ్రికా

ఆఫ్ఘనిస్తాన్

ఇంగ్లాండ్

వెస్టిండీస్

బంగ్లాదేశ్

PolitEnt Media

PolitEnt Media

Next Story