టాప్‌లో రోహిత్..

ICC ODI rankings: ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌‌లో టీమిండియా బ్యాటర్లు తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. భారత ఆటగాళ్లు అగ్రస్థానాల్లో నిలవగా, పాకిస్తాన్ స్టార్ బాబర్ ఆజమ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజమ్‌ను వెనక్కు నెట్టి టాప్-5లోకి చేరాడు. గత వారం ఆరో స్థానంలో ఉన్న కోహ్లి, ఒక స్థానం మెరుగుపరుచుకుని ఐదో స్థానానికి ఎగబాకాడు.

కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. మరో టీమిండియా స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్, ఆసీస్ సిరీస్‌లో ఒక హాఫ్ సెంచరీతో రాణించి తొమ్మిదో స్థానాన్ని కాపాడుకున్నాడు.

బాబర్‌కు భారీ నష్టం

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఈ ర్యాంకింగ్స్‌లో భారీగా నష్టపోయాడు. సౌతాఫ్రికా సిరీస్‌లో ఘోరంగా విఫలం కావడంతో బాబర్ రెండు స్థానాలు కోల్పోయి ఏడో స్థానానికి పడిపోయాడు.

లాభపడ్డ పాక్, సౌతాఫ్రికా ఆటగాళ్లు

సౌతాఫ్రికా సిరీస్‌లో రాణించిన యువ ఆల్‌రౌండర్ సైనమ్ అయూబ్ ఏకంగా 18 స్థానాలు మెరుగుపరుచుకుని 36వ స్థానానికి ఎగబాకాడు. అలాగే శ్రీలంకతో జరిగిన వన్డేలో సెంచరీ కొట్టిన పాక్ టీ20 కెప్టెన్ సల్మాన్ అఘా 14 స్థానాలు మెరుగుపరుచుకుని 16వ స్థానానికి చేరుకున్నాడు. పాక్‌తో సిరీస్‌లో సెంచరీ, హాఫ్ సెంచరీ చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచిన సౌతాఫ్రికా ఆటగాడు క్వింటన్ డికాక్ నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని 15వ స్థానానికి చేరాడు.

బౌలర్లు, ఆల్‌రౌండర్లు ర్యాంకింగ్స్

బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్‌ పేసర్ జోఫ్రా ఆర్చర్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని మూడో స్థానానికి చేరాడు. దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. భారత్ నుంచి టాప్-10లో కులదీప్ యాదవ్ 6వ స్థానంలో ఒక్కడే ఉన్నాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్‌జాయ్ అగ్రస్థానాన్ని కాపాడుకోగా.. భారత ఆటగాడు అక్షర్ పటేల్ ఎనిమిదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story