ICC ODI Rankings: రోహిత్ శర్మ దూకుడు .. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన టీమిండియా
సత్తా చాటిన టీమిండియా

ICC ODI Rankings: ఇంగ్లాండ్‌తో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్ తర్వాత ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌ను భారత్ కోల్పోయినప్పటికీ, అంతర్జాతీయ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మాత్రం భారత బ్యాటర్లు తమ ఆధిపత్యాన్ని స్పష్టంగా చాటుకున్నారు. ప్రపంచంలోనే టాప్-4 వన్డే బ్యాటర్లలో ఏకంగా ముగ్గురు భారతీయులే ఉండటం విశేషం
న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ 802 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే భారత టీమ్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 801 రేటింగ్ పాయింట్లతో కేవలం ఒక్క పాయింట్ తేడాతో నంబర్-1 స్థానానికి చేరువయ్యాడు! ఇంగ్లాండ్‌పై మూడు మ్యాచ్‌ల్లో 188 పరుగులు సాధించిన గిల్, ఇప్పుడు మిచెల్ సింహాసనానికి గట్టి పోటీ ఇస్తున్నాడు.
మరోవైపు 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మ సైతం తన జోరు చూపెట్టాడు! లార్డ్స్ మైదానంలో 138 పరుగుల అద్భుత సెంచరీతో అదరగొట్టిన రోహిత్, 14 రేటింగ్ పాయింట్లను సాధించి 758 పాయింట్లతో 4వ స్థానానికి ఎగబాకాడు. విరాట్ కోహ్లీ 767 పాయింట్లతో 3వ స్థానంలో స్థిరంగా ఉన్నాడు.
ఇతర ఆటగాళ్ల విషయానికి వస్తే.. భారత్‌తో సిరీస్‌లో మెరిసిన ఇంగ్లాండ్ స్టార్ జో రూట్ 4 స్థానాలు ఎగబాకి 8వ స్థానానికి చేరుకున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (682 పాయింట్లు), ఆల్‌రౌండర్ల జాబితాలో అజ్మతుల్లా ఒమర్జాయ్ అగ్రస్థానాల్లో కొనసాగుతున్నారు.

