ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్ .. టాప్ లోనే స్మృతి
టాప్ లోనే స్మృతి

ICC Rankings: ఐసీసీ (ICC) మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అగ్రస్థానంలో కొనసాగుతోంది. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ ప్రకారం ఆమె అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది .ఆమె రెండో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ కెప్టెన్ నాట్ స్కివర్-బ్రంట్ కంటే ముందుంది.
ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌తో పాటు ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో ఆమె వరుసగా అర్ధ సెంచరీలు చేసి అద్భుతంగా రాణించడం వల్ల ఈ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. గతంలో ఆమె తన కెరీర్‌లోనే అత్యధికంగా 818 రేటింగ్ పాయింట్లు సాధించింది.
హర్మన్‌ప్రీత్ కౌర్ మూడు స్థానాలు మెరుగుపరుచుకుని 15వ స్థానానికి చేరుకుంది.బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో దీప్తి శర్మ మూడు స్థానాలు ఎగబాకి 3వ స్థానంలో నిలిచింది.వరల్డ్ కప్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీయడం ఆమెకు కలిసొచ్చింది.
