ఐసీసీ చర్యలు..

ICC: ఇంగ్లండ్‌‌‌‌తో లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో బెన్ డకెట్ వికెట్ తీసిన తర్వాత దూకుడుగా ప్రవర్తించిన ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌‌‌‌పై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నాడు. అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించాడు. అలాగే, అతని రికార్డులో ఒక డీమెరిట్ పాయింట్ కూడా చేర్చాడు.

ఐసీసీ నిబంధనల ప్రకారం ఔటైన బ్యాటర్‌‌‌‌‌‌‌‌ను కించపరిచేలా, రెచ్చగొట్టేలా వ్యవహరించకూడదు. డకెట్ ఔటైన తర్వాత సిరాజ్ అతని దగ్గరకు వెళ్లి దూకుడుగా సంబరాలు చేసుకుంటూ భుజాలను తాకాడు. దాంతో తను రూల్స్ బ్రేక్ చేసినట్టు రిఫరీ గుర్తించాడు. గత 24 నెలల్లో సిరాజ్‌‌‌‌కు ఇది రెండో ఉల్లంఘన కావడంతో అతని డీమెరిట్ పాయింట్లు రెండుకు చేరాయి. 4 పాయింట్లు దాటితే సిరాజ్‌పై నిషేధం పడే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story