అండర్-19 వరల్డ్ కప్ షెడ్యూల్

ICC Under-19 World Cup 2026: ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. 2026 జనవరి 15 నుండి ఫిబ్రవరి 6 వరకు జింబాబ్వే, నమీబియా దేశాల్లో ఈ టోర్నమెంట్ జరగనుంది. 16 టీమ్స్‌ నాలుగు గ్రూపులుగా విడిపోగా గ్రూపుAలో భారత్, USA, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఉన్నాయి. గ్రూప్ స్టేజ్, ఆ తర్వాత ప్రతి గ్రూప్ నుండి టాప్ 3 జట్లు సూపర్ సిక్స్ దశకు అర్హత సాధిస్తాయి. ఈ ప్రదర్శన ఆధారంగా సెమీస్ అనంతరం ఫైనల్ జట్లు ఖరారు కానున్నాయి. ఫిబ్రవరి 6 ఫైనల్ హరారేలో జరగనుంది. భారత జట్టు గ్రూప్-A లో జనవరి 15 USA, జనవరి 17 బంగ్లాదేశ్, జనవరి 24న్యూజిలాండ్ జట్లతో తలపడనుంది.

ఏ గ్రూప్ లో ఏ జట్టు

గ్రూప్ A: భారత్, బంగ్లాదేశ్, USA, న్యూజిలాండ్

గ్రూప్ B: జింబాబ్వే (సహా-ఆతిథ్య), పాకిస్తాన్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్

గ్రూప్ C: ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జపాన్, శ్రీలంక

గ్రూప్ D: టాంజానియా, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా

PolitEnt Media

PolitEnt Media

Next Story