ఇంగ్లాండ్‌ చిత్తు!

ICC Women's ODI World Cup 2025: ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉంది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసి తమ అజేయ పరంపరను సుస్థిరం చేసుకుంది. ఆల్‌రౌండర్లు అనాబెల్ సదర్లాండ్, ఆష్లీ గార్డ్‌నర్ అద్భుత ప్రదర్శన ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించింది. 245 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా ఒక దశలో 68 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన అనాబెల్ సదర్లాండ్ (98 నాటౌట్), ఆష్లీ గార్డ్‌నర్ (104 నాటౌట్) కలిసి ఇంగ్లాండ్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు ఏకంగా 180 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గార్డ్‌నర్ కేవలం 73 బంతుల్లోనే అద్భుత శతకం (104 నాటౌట్) సాధించగా, సదర్లాండ్ (98 నాటౌట్) సెంచరీకి అతి దగ్గరలో నిలిచింది. వీరిద్దరి ధాటికి ఆస్ట్రేలియా 40.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని తిరిగి దక్కించుకుంది. కీలక ఆటగాళ్ల ఆల్రౌండ్ ప్రదర్శనతో మెగా టోర్నీలో ఆస్ట్రేలియాను ఆపడం ఇతర జట్లకు సవాలుగా మారింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story