ICC Women's ODI World Cup 2025: వన్డే వరల్డ్ కప్: ఇంగ్లాండ్vs సౌతాఫ్రికా.. ఇవాళ తొలి సెమీఫైనల్
ఇవాళ తొలి సెమీఫైనల్

ICC Women's ODI World Cup 2025: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో ఇవాళ ఇంగ్లండ్ మహిళల జట్టు , సౌతాఫ్రికా మహిళల జట్టు మధ్య జరగనున్న మొదటి సెమీ-ఫైనల్ మ్యాచ్ జరగనుంది. బర్సపరా క్రికెట్ స్టేడియంలో మధ్యాహ్నం 3గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు నాలుగు సార్లు కప్ కొట్టిన ఇంగ్లాండ్ ఐదో సారి టైటిల్ పై గురిపెట్టగా..మొదటి సారి సెమీఫైనల్ చేరిన సౌతాఫ్రికా ఫైనల్ చేరుకోవాలని చూస్తోంది.
వర్షం కారణంగా మ్యాచ్‌కి అంతరాయం కలిగితే, ఈ సెమీ-ఫైనల్ కోసం రిజర్వ్ డే కూడా అందుబాటులో ఉంది. రిజర్వ్ డే రోజున కూడా ఫలితం రాకపోతే, లీగ్ దశలో మెరుగైన స్థానంలో ఉన్న ఇంగ్లండ్ జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది.
ఇంగ్లాండ్ జట్టు
టామీ బ్యూమాంట్, అమీ జోన్స్ (వికెట్ కీపర్), హీథర్ నైట్, నాట్ స్కైవర్-బ్రంట్ (కెప్టెన్), సోఫియా డంక్లీ, ఎమ్మా లాంబ్, ఆలిస్ కాప్సే, షార్లెట్ డీన్, సోఫీ ఎక్లెస్టోన్, లిన్సే స్మిత్, లారెన్ బెల్
సౌతాఫ్రికా జట్టు
లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్ ), తజ్మిన్ బ్రిట్స్, సునే లూస్, అన్నేరీ డెర్క్‌సెన్, మారిజానే కాప్, సినాలో జాఫ్తా (వికెట్ కీపర్ ), క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, నొండుమిసో షాంగసే, మసాబాటా క్లాస్, నాన్‌కులులేకో మ్లాబా

