ICC Women's T20 World Cup 2026: లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్ మ్యాచ్‌ ద్వారా ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్‌రౌండర్ ఎల్లీస్ పెర్రీ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మెగా ఫైనల్లో మైదానంలోకి అడుగుపెట్టడం ద్వారా, మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యధికంగా 7 టీ20 ప్రపంచకప్ ఫైనల్స్ ఆడిన రెండో ఆటగాడిగా పెర్రీ నిలిచింది. ఈ ఘనతతో ఆమె తన దేశానికే చెందిన మాజీ కెప్టెన్, సుదీర్ఘకాలం పాటు సహచర ఆటగాడిగా ఉన్న అలిస్సా హీలీ పేరిట ఉన్న ఆల్‌-టైమ్ రికార్డును సమం చేసింది. ప్రపంచ క్రికెట్‌లో మరే మహిళా క్రికెటర్‌కు కూడా ఇన్ని సార్లు టీ20 ప్రపంచకప్ ఫైనల్స్ ఆడిన రికార్డు లేదు.

వాస్తవానికి ఈ హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్‌లో పెర్రీ ఆడటంపై మ్యాచ్‌కు ముందు వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వెస్టిండీస్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా ఆమెకు స్వల్పంగా తొడ కండరాల గాయం (మైనర్ క్వాడ్ అవేర్‌నెస్) కావడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరిగింది. ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆసీస్ హెడ్ కోచ్ షెల్లీ నిట్ష్కే విలేకరులతో మాట్లాడుతూ.. పెర్రీ 100 శాతం ఫిట్‌గా లేకపోయినా, కేవలం బ్యాటింగ్‌తో లేదా ఫీల్డింగ్‌తో జట్టుకు సహకరించే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఫైనల్లో ఆడిస్తామని, ఇది ప్రపంచకప్ ఫైనల్ కాబట్టి ఆమె విషయంలో ముందడుగు వేస్తామని హింట్ ఇచ్చారు.

అయితే, మ్యాచ్‌కు ముందు జరిగిన టాస్ సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్ సోఫీ మోలినాక్స్ పెర్రీ ఫిట్‌నెస్‌పై స్పష్టతనిస్తూ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిన్నటి ప్రాక్టీస్ సెషన్‌లో పెర్రీ చాలా చక్కగా రాణించిందని, ఆమె పూర్తిగా కోలుకోవడంతో జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా ఫైనల్ బరిలోకి దిగుతున్నామని ప్రకటించింది. గాయాన్ని లెక్కచేయకుండా బరిలోకి దిగిన పెర్రీ.. ఆస్ట్రేలియా జట్టు రికార్డు స్థాయిలో 7వ సారి ప్రపంచకప్ ట్రోఫీని గెలవడంలో తన వంతు పాత్ర పోషించి, సరికొత్త రికార్డుతో పాటు మరో ప్రపంచకప్ మెడల్‌ను తన ఖాతాలో వేసుకుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story