Ashish Nehra: టీమిండియా కోచ్‌గా అంటే? ముందు నా భార్యను అడగాలి: ఆశిష్ నెహ్రా
ఆశిష్ నెహ్రా

Ashish Nehra: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ పై ప్రస్తుతం విమర్శల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే! జట్టు ఎంపిక, ఆటగాళ్లకు తగిన అవకాశాలు ఇవ్వకపోవడం, తరచూ స్థానాలను మార్చడం వంటి అంశాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో గంభీర్‌ను తప్పించి, వీవీఎస్ లక్ష్మణ్ లేదా ఆశిష్ నెహ్రాను కొత్త కోచ్‌గా నియమించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
మరి ఈ వార్తలపై ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రా ఎలా స్పందించారో తెలుసా? టీమిండియా కోచ్‌గా బాధ్యతలు చేపడతారా అనే ప్రశ్నపై నెహ్రా తనదైన శైలిలో ఫన్నీగా బదులిచ్చారు. "టీమిండియా కోచ్‌గా వ్యవహరించడం గొప్ప గౌరవమే, కానీ నాకు అలాంటి నిర్దిష్టమైన ఆశయం ఏమీ లేదు. ప్రస్తుతానికి గుజరాత్ టైటాన్స్‌తో చాలా సంతోషంగా ఉన్నాను" అని స్పష్టం చేశారు. అంతేకాదు, ఒకవేళ ఆ అవకాశం వస్తే ముందుగా తన భార్యను అడగాలంటూ.. ఆమెకు చెప్పకుండా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా విడాకులు ఇచ్చే ప్రమాదం ఉందని సరదాగా వ్యాఖ్యానించారు. జాతీయ జట్టుకు కోచింగ్ అంటే ఏడాదిలో ఎనిమిది తొమ్మిది నెలలు ప్రయాణాలు చేయాల్సి ఉంటుందని, ఇది అంత సులభం కాదని ఆయన పేర్కొన్నారు.
ఇక ఇదే సందర్భంలో 2027 వన్డే ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడతారా లేదా అనే దానిపై కూడా నెహ్రా మాట్లాడారు. వరల్డ్ కప్‌నకు ఇంకా చాలా సమయం ఉందని, ప్రస్తుతానికి రోహిత్, కోహ్లీల రాకను కొట్టిపారేయలేమని ఆయన అభిప్రాయపడ్డారు. టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేలపైనే దృష్టి పెట్టిన ఈ సీనియర్ ద్వయం.. సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభంకానున్న వెస్టిండీస్ వన్డే సిరీస్‌లో బరిలోకి దిగడానికి సిద్ధమవుతోంది.
మరి ఆశిష్ నెహ్రా చెప్పినట్లుగా భవిష్యత్‌లో భారత జట్టు కోచ్ రేసులోకి ఆయన వస్తారా? లేక రోహిత్, కోహ్లీలు 2027 ప్రపంచ కప్ వరకు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారా? చూడాలి మరి!

