రోహిత్ పై ద్రవిడ్ ప్రశంసలు

Dravid Praises Rohit: భారత మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన ద్రవిడ్, రోహిత్ శర్మతో తనకున్న అనుబంధం గురించి, అతని కెప్టెన్సీ గురించి ప్రశంసించారు.

కెప్టెన్‌గా రోహిత్ శర్మకు జట్టును ఎలా నడిపించాలో మొదటి రోజు నుంచే స్పష్టమైన ఆలోచన ఉండేదని ద్రవిడ్ తెలిపారు. కోచ్‌గా తన పని కేవలం కెప్టెన్‌కు మద్దతుగా ఉండటం, అవసరమైనప్పుడు సలహాలు ఇవ్వడం మాత్రమేనని ద్రవిడ్ చెప్పారు. జట్టును ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కెప్టెన్‌దే అని ఆయన నమ్మారు.

రోహిత్‌తో తన బంధం కేవలం క్రికెట్‌కే పరిమితం కాలేదని, క్రికెట్ కాకుండా ఇతర విషయాలు కూడా మాట్లాడుకునేవారని ద్రవిడ్ చెప్పారు. రోహిత్‌తో సమయం గడపడం చాలా తేలికగా అనిపించేదని ఆయన తెలిపారు. అండర్-19 స్థాయి నుంచి చూసిన ఒక యువకుడు, ఒక గొప్ప ఆటగాడిగా, నాయకుడిగా ఎదగడం చూడటం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని ద్రవిడ్ అన్నారు.

ద్రవిడ్ కోచ్‌గా, రోహిత్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు భారత జట్టు అనేక విజయాలు సాధించింది. వీరిద్దరి హయాంలోనే భారత్ 2023 ఆసియా కప్, 2024 టీ20 ప్రపంచకప్‌లను గెలుచుకుంది. అలాగే, 2023 వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరింది. ద్రవిడ్ చేసిన ఈ వ్యాఖ్యలు రోహిత్ శర్మ నాయకత్వంపై, వారిద్దరి మధ్య ఉన్న మంచి అనుబంధం ఏంటో తెలుస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story