IND vs AFG Test: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన రాహుల్, సుదర్శన్.. భారీ స్కోర్ దిశగా భారత్
భారీ స్కోర్ దిశగా భారత్

IND vs AFG Test: అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా నిలకడగా రాణిస్తోంది. భారత బ్యాటర్లు అద్భుతమైన ఫామ్‌తో ఆఫ్ఘన్ బౌలర్లపై పూర్తి స్థాయిలో ఒత్తిడి పెంచుతున్నారు.ముఖ్యంగా ఓపెనర్ కేఎల్ రాహుల్ క్లాస్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటుంటే, మరోవైపు యువ సంచలనం సాయి సుదర్శన్ చెలరేగిపోతున్నాడు. బాధ్యతాయుతంగా ఆడుతున్న ఈ ఇద్దరూ వరుస హాఫ్ సెంచరీలతో ఆఫ్ఘన్ బౌలింగ్ ఎటాక్‌ను తిప్పికొట్టారు.
ఇన్నింగ్స్‌ను చక్కగా నిర్మించిన కేఎల్ రాహుల్ 86 బంతుల్లో తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకోగా... సాయి సుదర్శన్ మాత్రం టీ20 శైలిలో కేవలం 67 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. మరీ ముఖ్యంగా, వరుసగా మూడు బౌండరీలు బాది తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్న విధానం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. తన దూకుడుతో అఫ్గాన్ బౌలర్లను సుదర్శన్ ముప్పతిప్పలు పెట్టాడు.
ప్రస్తుతం 38 ఓవర్లు ముగిసే సరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 162 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్ 64 పరుగులు, సాయి సుదర్శన్ 71 పరుగులతో పటిష్టమైన స్థితిలో నిలిచారు. భారత్ భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది.

