IND vs ENG: రెండో రోజు ఇంగ్లాండ్ జోరు..స్కోర్ ఎంతంటే.?
స్కోర్ ఎంతంటే.?

IND vs ENG: భారత్ తో జరుగుతోన్న నాల్గో టెస్టులో రెండో రోజు ఇంగ్లాండ్ పై చేయి సాధించింది. భారత్ ను 358కి ఆలౌట్ చేసి..ఆట ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఇంకా 133 పరుగుల వెనుకంజలో ఉంది.
మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 358 పరుగులకు ఆలౌట్ అయింది. రిషబ్ పంత్ గాయంతో బ్యాటింగ్ చేస్తూ 54 పరుగులు చేయగా, సాయి సుదర్శన్ 61, యశస్వి జైస్వాల్ 58 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లు తీశాడు.
రెండవ రోజు ఆట ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. బెన్ డకెట్ 94, జాక్ క్రాలీ 84 పరుగులతో రాణించారు. అరంగేట్రం చేసిన అన్షుల్ కంబోజ్ తన మొదటి టెస్ట్ వికెట్‌ను డకెట్‌ను అవుట్ చేసి తీశాడు.ప్రస్తుతం ఇంగ్లాండ్ భారత్ కంటే 133 పరుగులు వెనుకబడి ఉంది. ఈరోజు మధ్యాహ్నం మూడవ రోజు ఆట ప్రారంభం కానుంది. భారత్ బౌలర్లు రాణించి త్వరగా వికెట్లు తీయాల్సి ఉంది లేదంటే ఇంగ్లాండ్ భారీ ఆధిక్యం సాధించే అవకాశం ఉంది.
ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ ఇప్పటికే 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. నాల్గో టెస్టులో భారత్ గెలవడం చాలా ముఖ్యం, లేదంటే సిరీస్ ఇంగ్లాండ్ కైవసం అవుతుంది. రిషబ్ పంత్ గాయం జట్టుకు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. రిషబ్ పంత్ ప్లేసులో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు స్వీకరించాడు.
