India Announces Squad for ODI Series: న్యూజిలాండ్ తో వన్డే సిరీస్..భారత్ జట్టు ప్రకటన
భారత్ జట్టు ప్రకటన

India Announces Squad for ODI Series: జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న న్యూజిలాండ్ వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.
ఈ సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జట్టులోకి తిరిగి రాగా, హార్దిక్ పాండ్యా , జస్ప్రీత్ బుమ్రాకు ఈ సిరీస్ నుండి విశ్రాంతి ఇచ్చారు.
భారత వన్డే జట్టు,
శుభ్‌మన్ గిల్(కెప్టెన్)శ్రేయస్ అయ్యర్ (,వైస్ కెప్టెన్ ), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, కె.ఎల్. రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్
గాయం కారణంగా గత సిరీస్‌లకు దూరమైన శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా తిరిగి వచ్చారు. అయితే ఆయన అందుబాటు అనేది బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) ఇచ్చే క్లియరెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. రాబోయే టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతి కల్పించారు.
మొదటి వన్డే జనవరి 11న వడోదర, రెండో వన్డే జనవరి 14 రాజ్‌కోట్ లో, మూడో వన్డే జనవరి 18న ఇండోర్ లో జరగనుంది. వన్డే సిరీస్ ముగిసిన తర్వాత జనవరి 21 నుంచి 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు.

