India Crushes South Africa in First T20: తొలి టీ20లో సౌతాఫ్రికాపై ఇండియా రికార్డ్ విక్టరీ
ఇండియా రికార్డ్ విక్టరీ

India Crushes South Africa in First T20: సౌతాఫ్రికాతో జరిగిన మొట్టమొదటి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 101 పరుగుల భారీ తేడాతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా జట్టు కేవలం 12.3 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌట్ అయింది. ఇది టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో సౌతాఫ్రికాకు అత్యల్ప స్కోరుగా నిలిచింది.ఇండియా బౌలర్లు కట్టుదిట్టమైన బాల్స్ వేయడంతో టార్గెట్ ఛేజింగ్‌లో సౌతాఫ్రికా ఆది నుంచే తడబడింది. ఏ దశలోనూ ఆతిథ్య జట్టుకు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ (2/14), జస్ప్రీత్ బుమ్రా (2/17), వరుణ్ చక్రవర్తి (2/19) చెరో 2 వికెట్లు తీసి సఫారీ బ్యాటింగ్ లైనప్‌ను కూల్చారు.
ఆసియా కప్ తర్వాత 74 రోజుల గ్యాప్ తీసుకొని జట్టులోకి వచ్చిన హార్దిక్ ఆరో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. బరోడా తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఫిట్‌నెస్ నిరూపించుకున్న హార్దిక్ అదే జోరును ఇక్కడా కొనసాగించాడు. వచ్చీ రాగానే స్పిన్నర్ కేశవ్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. బ్యాటింగ్‌లో 59 పరుగులు, బౌలింగ్‌లో 1 వికెట్ తీసిన హార్దిక్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌లో తన 100వ టీ20 అంతర్జాతీయ వికెట్‌ను కూడా పూర్తి చేశారు.

