ఆసిస్ దే సిరీస్

Three-match ODI series:నిన్న హోబర్ట్‌లో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా మహిళల జట్టు 5 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌తో ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 251/9 (50 ఓవర్లు) పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (54), ఓపెనర్ ప్రతీక రావల్ (52) అర్ధసెంచరీలతో రాణించారు. ఒక దశలో 280-300 పరుగులు వస్తాయనిపించినా, వరుస వికెట్లతో భారత్ 251 పరుగులకే పరిమితమైంది.

టార్గెట్ బరిలో ఆస్ట్రేలియా 252/5 (36.1 ఓవర్లు) చాలా వేగంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఆస్ట్రేలియా ఓపెనర్ జార్జియా వోల్ (101) అద్భుత సెంచరీతో జట్టును గెలిపించి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచింది.

ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 80 పరుగులతోఇచ్చిన మద్దతు ఆస్ట్రేలియాను గెలుపు ముంగిట నిలబెట్టింది.

రేపు జరిగే మూడో వన్డేలో గెలిస్తే భారత్‌ క్లీన్ స్వీప్ నుంచి తప్పించుకోవచ్చు.. వన్డే సిరీస్ కోల్పోయినా, మల్టీ-ఫార్మాట్ సిరీస్‌లో నిలవాలంటే రేపటి మ్యాచ్, ఆ తర్వాత మార్చి 6 నుండి పెర్త్‌లో ఏకైక టెస్ట్ మ్యాచ్ భారత్ కు కీలకం.మరి మూడో వన్డేలో భారత్ పుంజుకుంటుందా? జెమిమా, స్మృతి మంధాన భారీ స్కోర్లు సాధిస్తారా? లేదా చూడాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story