India Clinches the Series: ఐదో టీ20లో ఇండియా ఓటమి..అయినా సిరీస్ మనదే..
అయినా సిరీస్ మనదే..

India Clinches the Series: ఇంగ్లాండ్ తో జరిగిన ఐదో టీ20లో ఉమెన్స్ ఇండియా ఓటమి పాలైంది. నిన్న అర్థరాత్రి ముగిసిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. షఫాలీ వర్మ ఇండియా తరపున 75 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ విజయం సాధించలేకపోయింది. చార్లీ డీన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కగా.. సిరీస్ లో 10 వికెట్లు తీసిన శ్రీచరణికి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి.
ఈ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ, భారత మహిళల జట్టు 3-2 తేడాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను గెలుచుకుంది. ఇంగ్లాండ్‌పై భారత మహిళల జట్టుకు ఇది మొదటి టీ20 సిరీస్ విజయం కావడం విశేషం. రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జూలై 16న సౌతాంప్టన్‌లో మొదలు కానుంది.
