ఆస్ట్రేలియాదే సిరీస్

India Loses Second ODI: భారత్ తో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. అడిలైడ్ ఓవల్ లోజరిగిన ఈ వన్డేలో ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో గెలుచుకుంది.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇండియా 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (73), శ్రేయాస్ అయ్యర్ (61), అక్షర్ పటేల్ (44)పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా (4/60) అద్భుతంగా రాణించాడు.

అనంతరం టార్గెట్ బరిలో ఆస్ట్రేలియా 46.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను చేధించింది. మాథ్యూ షార్ట్ (74), కూపర్ కొన్నోలీ (61 నాటౌట్) రాణించారు.భారత

బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ (2/41), హర్షిత్ రాణా (2/59), వాషింగ్టన్ సుందర్ (2/37) వికెట్లు తీశారు. ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది.

ఈ విజయంతో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story