టీమిండియా బిజీ బిజీ

India National Cricket Team: హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌కు బీసీసీఐ తీపి కబురు చెప్పింది. చాన్నాళ్ల తర్వాత భాగ్యనగరానికి రెండు ఇంటర్నేషనల్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు కేటాయించింది. అక్టోబర్ 14న వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌తో నాలుగో టీ20 మ్యాచ్‌‌‌‌‌‌‌‌, జనవరి 6న జింబాబ్వేతో రెండో వన్డే పోరుకు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–గావస్కర్ ట్రోఫీ సహా సెప్టెంబర్ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు స్వదేశంలో జరిగే సిరీస్‌‌‌‌‌‌‌‌ల షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను బోర్డు గురువారం ప్రకటించింది. వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియాతో జరిగే ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్‌‌‌‌‌‌‌‌ల్లో 22 ఇంటర్నేషనల్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు 17 సిటీల్లో జరగనున్నాయి. ఇందులో 9 వన్డేలు, 8 టీ20లు, 5 టెస్టులు ఉన్నాయి. సెప్టెంబర్ 27 నుంచి ఇండియాలో వెస్టిండీస్ టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో హోమ్‌‌‌‌‌‌‌‌ సీజన్ షురూ కానుంది. అక్టోబర్ 17 వరకు సాగే ఈ టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విండీస్‌‌‌‌‌‌‌‌.. ఇండియాతో మూడు వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. ఇందులో నాలుగో టీ20కి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది.

అనంతరం డిసెంబర్ 13 నుంచి 27 వరకు శ్రీలంకతో ఇండియా మూడు వన్డేలు, మూడు టీ20ల్లో పోటీ పడనుంది. ఇక జింబాబ్వేతో జనవరి 3 నుంచి జరిగే మూడు వన్డేల సిరీస్‌‌‌‌‌‌‌‌తో టీమిండియా కొత్త ఏడాదిని ప్రారంభించనుంది. ఇందులో రెండో వన్డే హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో జరగనుంది. 2002 తర్వాత జింబాబ్వే మన దేశ పర్యటనకు రాబోతుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. అనంతరం జనవరి 21న మొదలయ్యే ఐదు టెస్టుల సిరీస్ కోసం ఆసీస్‌‌‌‌‌‌‌‌.. ఇండియా రానుంది. మార్చి 3 వరకు సాగే ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌లో ఐదు టెస్టులకు వరుసగా నాగ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చెన్నై, గువాహతి, రాంచీ, అహ్మదాబాద్ ఆతిథ్యం ఇస్తాయి. టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చిన లెజెండరీ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (రో–కో) స్వదేశంలో తొమ్మిది వన్డేల్లోనూ బరిలోకి దిగే చాన్సుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story