India, New Zealand T20 series: మూడో టీ20లో న్యూజిలాండ్ పై భారత్ రికార్డ్ విక్టరీ..సిరీస్ సొంతం
సిరీస్ సొంతం

India, New Zealand T20 series: గువాహటిలోని బర్సాపరా స్టేడియంలో జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్‌తో జరిగిన ఈ కీలక పోరులో భారత్ అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించి, 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0తో కైవసం చేసుకుంది
154 పరుగుల టార్గెట్ లో ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 14 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి సంచలనం సృష్టించాడు. ఇది భారత్ తరపున టీ20ల్లో రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ (యువరాజ్ సింగ్ 12 బంతుల రికార్డు తర్వాత). అతను 20 బంతుల్లో 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ధాటిగా ఆడి 26 బంతుల్లో 57 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 150 పైచిలుకు లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలోనే ఛేదించి భారత్ సరికొత్త రికార్డు నెలకొల్పింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌కు భారత బౌలర్లు ఏమాత్రం స్వేచ్ఛ ఇవ్వలేదు. పవర్‌ప్లే నుంచే కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్‌తో పరుగుల ప్రవాహాన్ని అడ్డుకున్నారు. కీలక సమయాల్లో వికెట్లు పడటంతో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ఒత్తిడిలోకి వెళ్లారు. మధ్య ఓవర్లలో స్పిన్నర్లు చక్కగా పని చేయగా, చివరి ఓవర్లలో పేసర్లు స్కోరును కట్టడి చేశారు.టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా (3/17) అద్భుతంగా రాణించగా, రవి బిష్ణోయ్ 2 వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్యా కూడా 2 వికెట్లు పడగొట్టాడు.న్యూజిలాండ్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ (48) మాత్రమే రాణించాడు. ఈ ఘన విజయంతో భారత్ వచ్చే నెలలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ 2026 కు తమ సన్నద్ధతను ఘనంగా చాటుకుంది.

