ఫైనల్ కు భారత్

Asia Cup Final: 2025 ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్‌లో భారత్ జట్టు బంగ్లాదేశ్‌పై 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 37 బంతుల్లోనే 75 పరుగులు (6 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా 38 పరుగులు చేసి జట్టు స్కోరును పెంచాడు.

169 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. బంగ్లాదేశ్ జట్టు 19.3 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌట్ అయింది. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టగా, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి చెరో 2 వికెట్లు తీసి బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేశారు. బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌లలో ఓపెనర్ సైఫ్ హసన్ (69) ఒక్కడే పోరాడినప్పటికీ, మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించకపోవడంతో బంగ్లాదేశ్ ఓటమిపాలైంది.

ఈ విజయంతో భారత్ టోర్నమెంట్‌లో ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఫైనల్ కోసం బంగ్లాదేశ్ , పాకిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్ విన్నర్ తో భారత్ తలపడుతుంది. శ్రీలంక టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story