FIH Junior Hockey World Cup: ఎఫ్ఐహెచ్ జూనియర్ హాకీ వరల్డ్ కప్ లో.. సెమీస్ కు భారత్
సెమీస్ కు భారత్

FIH Junior Hockey World Cup: ఎఫ్ఐహెచ్ పురుషుల జూనియర్ హాకీ ప్రపంచ కప్ 2025 (FIH Men's Junior Hockey World Cup 2025)లో భారత జట్టు సెమీ-ఫైనల్స్‌కు చేరుకుంది.నిర్ణీత సమయంలో 2-2తో సమం అయిన తర్వాత, షూటౌట్‌లో భారత్ 4-3 తేడాతో బెల్జియంను ఓడించి సెమీస్ లోకి ప్రవేశించింది. ఇందులో శ్రద్దానంద్ తివారీ మూడు గోల్స్ కొట్టాడు. అంకిత్ పాల్ ఒకసారి బంతిని గోల్ పోస్ట్‌లో పంపాడు. మధ్యలో గోల్ కీపర్ ప్రిన్స్‌దీప్ రెండుసార్లు ప్రత్యర్థులు కొట్టిన షాట్లను అద్భుతంగా అడ్డుకుని ఇండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. క్వార్టర్-ఫైనల్‌లో విజయం సాధించిన తరువాత, భారత్ ఇప్పుడు ఏడు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన బలమైన జర్మనీ జట్టుతో సెమీ-ఫైనల్‌లో తలపడుతుంది. డిసెంబర్ 7న తమిళనాడులోని చెన్నై , మధురైలో జరుగుతోంది. మరో సెమీ ఫైనల్ స్పెయిన్ vs అర్జెంటీనా మధ్య జరగనుంది. భారత జట్టు ఇప్పటికే రెండు సార్లు (2001, 2016లో) ఈ జూనియర్ హాకీ ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.

