భారత్ రెడీ

2026 Olympics: ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో జరిగిన 72వ జాతీయ వాలీబాల్ ఛాంపియన్‌షిప్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తూ, 2036 ఒలింపిక్ క్రీడల ఆతిథ్యంపై భారత్ ఉన్న పట్టుదలను మరోసారి చాటిచెప్పారు.2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ పూర్తి శక్తి సామర్థ్యాలతో సిద్ధమవుతోందని ప్రధాని ప్రకటించారు. ఈ మెగా ఈవెంట్‌ను భారత్‌కు తీసుకురావడమే 140 కోట్ల భారతీయుల కల అని, దాని కోసం ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందన్నారు.గత దశాబ్ద కాలంలో భారత్ 20కి పైగా ప్రధాన అంతర్జాతీయ క్రీడలను విజయవంతంగా నిర్వహించిందని గుర్తు చేశారు.2030 కామన్వెల్త్ గేమ్స్ కూడా భారత్‌లోనే జరగనున్నాయని, ఇది ఒలింపిక్స్ నిర్వహణకు ఒక వేదికగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఖేలో ఇండియా పథకం ద్వారా గ్రామీణ స్థాయిలోని ప్రతిభను గుర్తించి జాతీయ స్థాయికి తీసుకువస్తున్నట్లు తెలిపారు.TOPS (Target Olympic Podium Scheme): అథ్లెట్లకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ, పౌష్టికాహారం, సౌకర్యాలను కల్పిస్తూ వారిని మెడల్స్ సాధించే దిశగా తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు.నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ తో క్రీడా సంస్థల్లో పారదర్శకతను పెంచడానికి ప్రభుత్వం కొత్త సంస్కరణలు చేపట్టిందని పేర్కొన్నారు.

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, 2036 ఒలింపిక్స్ ఆతిథ్యానికి అహ్మదాబాద్ నగరాన్ని ప్రధాన వేదికగా భారత్ ప్రతిపాదించే అవకాశం ఉంది. దీని కోసం అహ్మదాబాద్ -గాంధీనగర్ జంట నగరాల్లో భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. భారత్ ఈ బిడ్‌ను గెలుచుకుంటే, చరిత్రలో తొలిసారిగా ఒలింపిక్స్ భారత్‌లో జరగనున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story