ఇండియా గ్రాండ్ విక్టరీ

India Registers a Grand Victory: తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై అద్భుత విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0తో కైవసం చేసుకుంది .భారత్ కేవలం 13.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది

భారత బౌలర్ల విజృంభణటాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి శ్రీలంకను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. 20 ఓవర్లలో 112/7 పరుగులు మాత్రమే చేసింది. పేసర్ రేణుక సింగ్ ఠాకూర్ 4 వికెట్లతో (4/21) శ్రీలంక టాపార్డర్‌ను దెబ్బతీసింది. స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ 3 వికెట్లు (3/18) పడగొట్టింది. ఈ క్రమంలో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 151 వికెట్లు పూర్తి చేసుకుని, ప్రపంచంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆస్ట్రేలియాకు చెందిన మేగన్ షూట్ రికార్డును సమం చేసింది.

షఫాలీ వర్మ మెరుపు ఇన్నింగ్స్113 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్ షఫాలీ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగింది. కేవలం 42 బంతుల్లోనే 79 పరుగులు (11 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి అజేయంగా నిలిచింది. ఆమె కేవలం 24 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేయడం విశేషం. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చింది. దీంతో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రేణుక సింగ్ ఠాకూర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా తన 77వ విజయాన్ని నమోదు చేసి, టీ20ల్లో అత్యంత విజయవంతమైన మహిళా కెప్టెన్‌గా నిలిచింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story