ఇండియా గ్రాండ్ విక్టరీ

India Registers a Grand Victory : ఆస్ట్రేలియాతో జరిగిన నాల్గో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. 168 పరుగుల టార్గెట్ తో బరిలోకి ఆస్ట్రేలియాను 48 పరుగుల తేడాతో ఓడించి విజయం సాధించింది. 168 పరుగుల టార్గెట్ బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను 18.2 ఓవర్లలోనే 119పరుగులకు ఆలౌట్ చేసింది ఇండియా. ఆస్ట్రేలియా ఓపెనర్లు మిచెల్ మార్ష్ 30, మ్యాథ్యు షార్ట్ 25 పరుగులు మినహా ఎవరూ రాణించలేకపోయారు. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లతో చెలరేగాడు.

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇండియా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి167 పరుగులు చేసింది.ఓపెనర్ శుభమాన్ గిల్ 46 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అభిషేక్ శర్మ (28), సూర్య కుమార్ యాదవ్ (20) కొన్ని మెరుపులు మెరిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఎల్లిస్, జంపా తలో మూడు వికెట్లు తీసుకున్నారు. బార్ట్ లెట్,మార్కస్ స్టోయినిస్ లకు తలో ఒక వికెట్ దక్కింది.

ఐదు టీ20ల సిరీస్ లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. వర్షం కారణంగా మొదటి మ్యాచ్ రద్దయింది. ఆస్ట్రేలియా ఒకటి గెలవగా.. ఇండియా రెండు టీ20లు గెలిచింది. ఇంకా ఐదో టీ20 మిగిలింది..సిరీస్ గెలవాలంటే ఇండియా ఐదో టీ20లో తప్పక గెలవాలి. లేదంటే ఆస్ట్రేలియా గెలిస్తే సిరీస్ డ్రా అవుతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story