ఇండియా గ్రాండ్ విక్టరీ

విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. హర్షిత సమరవిక్రమ (33), చమరి ఆటపట్టు (31) రాణించారు.భారత బౌలర్లలో శ్రీ చరణి, వైష్ణవి శర్మ తలో రెండు వికెట్లు తీసి శ్రీలంకను కట్టడి చేశారు. స్నేహ్ రాణా (1/11) కూడా పొదుపుగా బౌలింగ్ చేశారు.129 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు కేవలం 11.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.ఈ విజయంలో ఓపెనర్ షెఫాలీ వర్మ కీలక పాత్ర పోషించారు. కేవలం 34 బంతుల్లోనే 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 69 పరుగులు (నాటౌట్) చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఆమెతో పాటు జెమీమా రోడ్రిగ్స్ (26) వేగంగా ఆడారు. ఈ విజయంతో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, టీ20ల్లో అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా మెగ్ లానింగ్ (76 విజయాలు) రికార్డును సమం చేశారు. జ్వరం కారణంగా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. సిరీస్‌లో మూడో టీ20 డిసెంబర్ 26 తిరువనంతపురంలో జరగనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story