ఇండియా ఘోర ఓటమి

Second T20: భారత్ తో మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (MCG)లో జరిగిన రెండవ టీ20 ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించి, 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. భారత బ్యాటింగ్ ఘోరంగా విఫలమైంది. భారత ఇన్నింగ్స్18.4 ఓవర్లలో 125 ఆలౌట్ అయ్యింది. ముఖ్యంగా పవర్ ప్లేలో అభిషేక్ శర్మ 37 బంతుల్లో 68 పరుగులు (8 ఫోర్లు, 2 సిక్స్‌లు). హర్షిత్ రాణా 33 బంతుల్లో 35 పరుగులు. ఇతర బ్యాటర్లు శుభ్‌మన్ గిల్ (5), సంజు శాంసన్ (2), సూర్యకుమార్ యాదవ్ (1), తిలక్ వర్మ (0) తక్కువ స్కోరుకే అవుటయ్యారు.

ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ (3 వికెట్లు), నాథన్ ఎల్లిస్ (2 వికెట్లు), జేవియర్ బార్ట్‌లెట్ (2 వికెట్లు) తీశారు.

126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా సునాయాసంగా ఛేదించింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ 26 బంతుల్లో 46 పరుగులు (2 ఫోర్లు, 4 సిక్స్‌లు). ట్రావిస్ హెడ్ 15 బంతుల్లో 28 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా (2 వికెట్లు), వరుణ్ చక్రవర్తి (2 వికెట్లు), కుల్దీప్ యాదవ్ (2 వికెట్లు) తీశారు. మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయినందున, ఈ విజయం ద్వారా ఆస్ట్రేలియా సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story