డ్రాతో గట్టెక్కిన భారత్

Draw in the Fourth Test: భారత్ , ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాల్గో టెస్ట్ డ్రాగా ముగిసింది. కెప్టెన్ గిల్, రవీంద్ర జడేజా,వాషింగ్టన్ సుందర్ సెంచరీలు, కేఎల్ రాహుల్ 90 పరుగులు చేయడంతో ఓటమి నుంచి గట్టెక్కి డ్రాగా ముగించింది భారత్.

రెండో ఇన్నింగ్స్ లో కెప్టెన్‌గా గిల్ తన నాలుగో సెంచరీని (103) నమోదు చేశాడు. కేఎల్ రాహుల్ 90 పరుగులు చేసి, గిల్‌తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని అందించాడు.జడేజా 107 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, అద్భుతమైన సెంచరీ సాధించాడు. వాషింగ్టన్ సుందర్ 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, తన తొలి టెస్ట్ సెంచరీని నమోదు చేసి, జడేజాతో కలిసి మ్యాచ్‌ను కాపాడాడు.

భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 358 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 669 పరుగులు చేసింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ (141) అద్భుత సెంచరీతో రాణించాడు. దీంతో ఇంగ్లాండ్‌కు 311 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఆశించిన దానికంటే చాలా మెరుగ్గా ఆడింది. ఆఖరి రోజు ఆటలో శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ సెంచరీలు సాధించడంతో భారత్ 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.

ఈ డ్రాతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. సిరీస్‌లో చివరిదైన ఐదవ టెస్ట్ మ్యాచ్ జూలై 31న లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో జరగనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story