శ్రీలంకతో భారత్ రెండో టీ20

Second T20: భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య ఇవాళ రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ వైజాగ్ లోని డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి స్టేడియంలో రాత్రి 7:00 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ 6:30 గంటలకు ఉంటుంది.ప్రస్తుతం 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. విశాఖలోనే జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

గత మ్యాచ్‌లో జెమిమా రోడ్రిగ్స్ (69 పరుగులు) అద్భుతమైన ఫామ్‌ను కనబరిచింది. అలాగే స్మృతి మంధాన టీ20ల్లో 4000 పరుగుల మైలురాయిని చేరుకుంది. వైజాగ్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అయితే రాత్రి సమయంలో మంచు (Dew) ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున, టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

అయితే ఫస్ట్ టీ20లో ‌‌‌‌‌‌ మధ్యలో ఫీల్డింగ్‌, క్యాచింగ్‌‌‌‌‌‌‌‌లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు . దాంతో ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ప్రత్యేకంగా ఈ రెండు అంశాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. వరల్డ్‌కప్‌‌‌‌‌‌‌‌ విజయం తర్వాత ఇండియాకు ఆరు వారాల విరామం లభించింది. ఆ తర్వాత బెంగళూరులోని సెంటర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఎక్సలెన్స్‌‌‌‌‌‌‌‌లో వారం రోజుల క్యాంప్‌‌లో ఫీల్డింగ్‌‌‌‌‌‌‌‌పై కసరత్తులు కూడా చేసింది. అయినా ఫీల్డింగ్ ఆశించిన మేర లేదు. మరోవైపు చమరి ఆటపట్టు సారథ్యంలోని శ్రీలంక జట్టు పుంజుకోవాలని ఆశిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story