వైట్ బాల్ సిరీస్.!

White-Ball Series: ఇండియాతో వైట్ బాల్ సిరీస్ కు ప్లాన్ చేస్తోంది శ్రీలంక. తమతో సిరీస్ ఆడాలని బీసీసీఐని కోరింది శ్రీలంక బోర్డు. ఆగస్టు 2025లో శ్రీలంకతో ఇండియా వన్డే సిరీస్ జరిగే అవకాశం ఉంది. కానీ ఇది ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు.

వాస్తవానికి ఆగస్టు 2025లో బంగ్లాదేశ్‌తో జరగాల్సిన మూడు వన్డేల సిరీస్, మూడు టీ20ల సిరీస్ వాయిదా పడింది.దీనిని భర్తీ చేయడానికి శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)ని సంప్రదించింది. 3 వన్డేలు,3 టీ20లు తమ దేశంలో ఆడాలని ప్రతిపాదించారు.

BCCI ప్రస్తుతం ఈ ప్రతిపాదనను పరిశీలిస్తోంది. తుది నిర్ణయం ఆసియా కప్, ప్లేయర్లు,కోచ్ లపై చర్చించి డిసైడ్ చేయనున్నారు. అలాగే ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ తర్వాత దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆగస్టులో శ్రీలంకతో ఇండియా వన్డే సిరీస్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story