తొలి వికెట్ ఔట్

India Vs Australia 4th T20: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 28 పరుగులకు ఔటయ్యాడు. మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ నిలకడగా ఆడుతున్నాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 8 ఓవర్లు ముగిసే సరికి 61 పరుగులు చేసింది. శుభ్ మన్ గిల్ 29, శివమ్ దూబే 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ప్రస్తుతానికి, ఈ సిరీస్లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది. మరో రెండు టీ20ల్లో చెరొకటి గెలిచాయి. ఈ నాలుగో టీ20 సిరీస్‌లో ఆధిక్యం కోసం చాలా కీలకం కానుంది. ఐదు టీ20ల సిరీస్ దక్కాలంటే ఇరు జట్లు చివరి రెండు మ్యాచ్ లు తప్పక గెలవాల్సిన పరిస్థితి. దీంతో రెండు జట్లు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

ఆస్ట్రేలియా జట్టు

మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, జోష్ ఫిలిప్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా

భారత్ జట్టు

అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా

PolitEnt Media

PolitEnt Media

Next Story