India vs England: రేపే భారత్ తో రెండో పోరు..ఇంగ్లాండ్ టీం ఇదే...
ఇంగ్లాండ్ టీం ఇదే...

India vs England: ఫస్టె టెస్టులో గెలిచి ఊపు మీదున్న ఇంగ్లాండ్ రేపటి నుంచి బర్మింగ్ హోమ్ వేదికగా ఎడ్జ్‌బాస్టన్ లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టుకు రెడీ అయ్యింది. ఈ టెస్ట్ మ్యాచ్ కు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తమ ప్లేయింగ్ 11 ప్రకటించింది. టీంలో కొత్తగా ఫాస్ట్ బౌలర్ ను ఆర్చర్ ను చేర్చిన అతనికి తుది జట్టులో స్థానం కల్పించలేదు. తొలి టెస్ట్ ఆడిన తుది జట్టుతోనే ఇంగ్లాండ్ బరిలోకి దిగనుంది.
ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించిన ప్లేయింగ్ 11 లో 5 గురు బ్యాటర్లు, ఒక వికెట్ కీపర్, ఒక ఆల్ రౌండర్,. ముగ్గురు స్పెషలిస్ట్ సీమర్లు ఉన్నారు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ విషయానికి వస్తే ఓపెనర్లుగా బెన్ డకెట్, జాక్ క్రాలీ ఆడనున్నారు. మూడో స్థానంలో పోప్ బ్యాటింగ్ చేస్తాడు. సీనియర్ బ్యాటర్ జో రూట్, యువ సంచలనం హ్యారీ బ్రూక్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్ కు వస్తారు. కెప్టెన్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఆరో స్థానంలో బరిలోకి దిగనున్నాడు.
ఇంగ్లాండ్ టీం
బెన్ డకెట్, జాక్ క్రాలే, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్
