4 వికెట్లా.. 35 పరుగులా?

India vs England Test Series: ఇంగ్లాండ్,ఇండియా మధ్య జరుగుతోన్న ఐదో టెస్టు లాస్ట్ డేకి చేరింది. ఇంగ్లాండ్ విజయానికి ఇంకా 35 పరుగులు కావాలి.ఇండియా విజయానికి 4 వికెట్లు కావాలి. ఇంకా ఒకరోజు ఆట మిగిలి ఉంది. ఇరు జట్లకు గెలిచే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలిస్తే సిరీస్ కైవసం చేసుకుంటుంది. భారత్ గెలిస్తే సిరీస్ సమమం అవుతుంది. డ్రా అయినా సిరీస్ ఇంగ్గాండ్ కే దక్కుతుంది.

భారత్ ఫస్ట్ ఇన్నింగ్సులో 224 , రెండో ఇన్నింగ్స్ లో 396 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 247 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ విజయానికి 374 పరుగులు లక్ష్యంగా నిర్దేశించగా, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ విజయానికి ఇంకా 35 పరుగులు అవసరం కాగా, భారత్‌కు 4 వికెట్లు కావాలి.

ఐదో టెస్టులో మహమ్మద్ సిరాజ్ కీలకమైన క్యాచ్‌ను జారవిడిచారు అది మ్యాచ్‌ గమనాన్ని మార్చేసింది. నాలుగో రోజు ఆటలో, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్ కొట్టిన బంతిని సిరాజ్ బౌండరీ లైన్ వద్ద అందుకున్నాడు. కానీ క్యాచ్ పట్టుకునే క్రమంలో అతని కాలు బౌండరీ లైన్‌ను తాకడంతో అది ఔట్ కాకుండా ఆరు పరుగులుగా మారింది. అపుడు బ్రూక్ కేవలం 19 పరుగుల వద్ద ఉన్నాడు. ఆ తరువాత బ్రూక్ అద్భుతమైన శతకం (111 పరుగులు) సాధించి ఇంగ్లాండ్‌ను విజయానికి చేరువ చేశాడు. చివరికి, అదే సిరాజ్ బ్రూక్‌ని క్యాచ్ పట్టి ఔట్ చేసినప్పటికీ, అప్పటికే మ్యాచ్ ఇంగ్లాండ్ వైపు మళ్లింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story