మహిళల ఐదో టీ20

India vs England Today: ఇవాళ ఇండియా మహిళల జట్టు ఇంగ్లాండ్ తో ఐదో టీ20 ఆడనుంది. ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను ఇప్ప టికే 3-1తో సొంతం చేసుకున్న ఇండియా, ఇంగ్లండ్ తో చివరి మ్యాచు రెడీ అయ్యింది. ఇవాళ జరిగే మ్యాచ్ లోనూ జోరు కొనసాగించి సిరీస్ కు బలమైన ముగింపు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. చివరి టీ20లోనూ గెలిస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా 4-1తో సిరీస్ ను సాధించి కొత్త రికార్డును నెలకొల్పుతుంది. ఇంగ్లండ్ ఇండియా విమెన్స్ ఐదో టీ 20 రా. 11.05 నుంచి సోనీ స్పోర్ట్స్ లో లైవ్ చూడొచ్చు.

భారత మహిళల జట్టుకు తొలి టీ20 సిరీస్ విజయం ఇదే కావడం విశేషం. ఇవాళ జరిగే లాస్ట్ టీ20 మ్యాచ్ కేవలం నామమాత్రమే అయినప్పటికీ, భారత జట్టు సిరీస్‌ను 4-1తో ముగించాలని చూస్తోంది. మరోవైపు ఇంగ్లండ్ కూడా ఈ మ్యాచ్ లో గెలిచి పరువు కాపాడుకోవాలని యోచిస్తోంది. గాయం కారణంగా కెప్టెన్ బ్రంట్ లేకపోవడం టీమ్ బ్యాలెన్స్ ను దెబ్బతీస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story