India vs New Zealand T20 series: ఇవాళ న్యూజిలాండ్ తో ఇండియా రెండో టీ20
ఇండియా రెండో టీ20

India vs New Zealand T20 series: ఇవాళ భారత్ , న్యూజిలాండ్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం, రాయ్‌పూర్ లో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. నాగ్‌పూర్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ సిరీస్ జట్టుకు ఎంత ముఖ్యమో, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వ్యక్తిగత కెరీర్‌కు కూడా అంతే కీలకం. గత కొంతకాలంగా జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న సంజూకి ఓపెనర్ గా స్థానం దక్కింది. ఇషాన్ కిషన్ కూడా విజయ్ హజారే ట్రోఫీ, ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టి న్యూజిలాండ్ సిరీస్ కు రీ ఎంట్రీ ఇచ్చాడు కానీ విఫలమవుతున్నాడు. తొలి మ్యాచ్‌లో అభిషేక్ శర్మ (84), రింకూ సింగ్ (44 నాటౌట్) అద్భుతంగా రాణించారు. నేటి మ్యాచ్‌లో కూడా మనవాళ్ళు అదే జోరు కొనసాగిస్తారని ఆశిద్దాం!
భారత జట్టు (తుది జట్టు అంచనా):
అభిషేక్ శర్మ, సంజూ శామ్సన్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా/కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్.

