భారత్ ఘోర ఓటమి

India vs New Zealand T20 series: నాలుగో టీ20లో న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఇప్పటికే మూడు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్‌కు, ఈ ఓటమి సిరీస్‌లో మొదటిది.న్యూజిలాండ్ ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్ (62), డెవాన్ కాన్వే (44) మెరుపు ఇన్నింగ్స్‌లతో మొదటి వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివర్లో డారిల్ మిచెల్ (39) వేగంగా ఆడటంతో భారీ స్కోరు నమోదైంది. 20 ఓవర్లలో 215 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు

216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. అయితే శివమ్ దూబే కేవలం 23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 65 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. అతను కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేయడం విశేషం. ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ కాగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (8), హార్దిక్ పాండ్యా (2) నిరాశపరిచారు. రింకు సింగ్ (39), సంజు శాంసన్ (24) కొంతసేపు క్రీజులో ఉన్నా భారీ స్కోరు చేయలేకపోయారు.18.4 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌట్ అయ్యింది. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 3 వికెట్లు తీసి భారత్‌ను దెబ్బతీశాడు..న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. సిరీస్‌లో చివరిదైన ఐదో టీ20 మ్యాచ్ శనివారం (జనవరి 31) తిరువనంతపురంలో జరగనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story