India vs New Zealand T20 Series: ఇవాళ న్యూజిలాండ్ తో భారత్ నాలుగో టీ20
భారత్ నాలుగో టీ20

India vs New Zealand T20 Series: ఇవాళ భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 4వ టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 3-0 తో తిరుగులేని ఆధిక్యంలో ఉంది. వైజాగ్ లో రాత్రి 7:00 గంటలకు మ్యాజ్ జరగనుంది.
అభిషేక్ శర్మ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. గత మ్యాచ్‌ల్లో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ కూడా మంచి ప్రదర్శన చేశారు.భారత్ ఇప్పటికే సిరీస్ గెలుచుకోవడంతో, నేటి మ్యాచ్‌లో బెంచ్ స్ట్రెంత్‌ను పరీక్షించే అవకాశం ఉంది. సంజు శాంసన్ వరుసగా విఫలమవడంతో అతని స్థానంపై చర్చ జరుగుతోంది.
కివీస్ జట్టు కనీసం ఒక్క విజయాన్నైనా నమోదు చేసి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది. గ్లెన్ ఫిలిప్స్ మాత్రమే ఆ జట్టులో నిలకడగా రాణిస్తున్నాడు.
భారత తుది జట్టు (అంచనా):
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్/అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్, రింకూ సింగ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా/హర్షిత్ రాణా.

