జట్టులో మార్పులు

India vs New Zealand T20 series: భారత్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వరుసగా మూడు ఓటముల తర్వాత న్యూజిలాండ్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. జట్టులో మార్పులు చేస్తూ ఫాస్ట్ బౌలర్ క్రిస్టియన్ క్లార్క్, టాప్ ఆర్డర్ బ్యాటర్ టిమ్ రాబిన్సన్‌లను టీ20 స్క్వాడ్ నుండి రిలీజ్ చేసింది. వీరి స్థానంలో సీనియర్ ఆటగాళ్లు జట్టులోకి రానున్నారు.

జనవరి 21న నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టీ20 ద్వారా అరంగేట్రం చేసిన 24 ఏళ్ల క్రిస్టియన్ క్లార్క్, తన కోటాలో 40 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. మరోవైపు టిమ్ రాబిన్సన్ తొలి మ్యాచ్‌లో 15 బంతుల్లో 21 పరుగులు చేశాడు. అయితే, గత రెండు మ్యాచ్‌లుగా వీరిద్దరికీ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు. ప్రస్తుతం జిమ్మీ నీషమ్, లోకీ ఫెర్గూసన్, టిమ్ సీఫెర్ట్ వంటి సీనియర్లు జట్టులోకి రావడంతో క్లార్క్, రాబిన్సన్‌లను స్వదేశానికి పంపిస్తున్నట్లు కివీస్ బోర్డు ప్రకటించింది.

బిగ్ బాష్ లీగ్ (BBL)లో పెర్త్ స్కార్చర్స్ తరపున అదరగొట్టిన డాషింగ్ ఓపెనర్ ఫిన్ అలెన్, ఈ నెల 31న తిరువనంతపురంలో జరిగే ఐదవ టీ20 మ్యాచ్ కోసం జట్టుతో చేరనున్నాడు. BBLలో 11 మ్యాచుల్లో 466 పరుగులు చేసి అత్యధిక స్కోరర్‌గా నిలిచిన అలెన్ రాకతో కివీస్ బ్యాటింగ్ లైనప్ మరింత బలోపేతం కానుంది. ఒకే టీ20 మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్రపంచ రికార్డు కూడా అలెన్ పేరు మీదే ఉండటం విశేషం.

న్యూజిలాండ్ అప్‌డేటెడ్ టీమ్: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మార్క్ చాప్‌మన్, జకారీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధి, జాకబ్ డఫీ, జేమ్స్ నీషమ్, కైల్ జేమీసన్, మైకేల్ బ్రేస్‌వెల్, బెవాన్ జాకబ్స్, ఫిన్ అలెన్ (ఐదవ టీ20కి మాత్రమే).

PolitEnt Media

PolitEnt Media

Next Story