India vs Pakistan: భారత్ - పాకిస్థాన్.. ఆసియా కప్ ఫైనల్‌లో ఎప్పుడూ తలపడలేదా?
ఆసియా కప్ ఫైనల్‌లో ఎప్పుడూ తలపడలేదా?

India vs Pakistan: ప్రస్తుతం 17వ ఎడిషన్ ఆసియా కప్ జరుగుతోంది. ఈ టోర్నీలో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే మ్యాచ్ భారత్ - పాకిస్థాన్ పోరు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌తో సంబంధాలపై దేశంలో చర్చ జరుగుతున్నప్పటికీ.. సెప్టెంబర్ 14న జరగనున్న ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫైనల్‌లో ఎప్పుడూ కలవని చిరకాల ప్రత్యర్థులు
ఆసియా కప్ చరిత్రలో భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటివరకు 19 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, పాకిస్థాన్ కేవలం ఆరింట్లో గెలిచింది. మరో మూడు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఈ మ్యాచ్‌లన్నీ గ్రూప్ స్టేజ్, సూపర్ 4 లేదా సెమీస్‌లో మాత్రమే జరిగాయి. ఆసియా కప్ ఫైనల్‌లో మాత్రం ఇరు జట్లు ఒక్కసారి కూడా తలపడలేదు.
భారత్ ఇప్పటివరకు ఎనిమిది సార్లు ఆసియా కప్ విజేతగా నిలిచింది. అయితే, ఒక్కసారి కూడా ఫైనల్‌లో పాక్‌తో తలపడలేదు. మరోవైపు పాకిస్థాన్ రెండుసార్లు మాత్రమే ఛాంపియన్‌గా నిలిచింది. టీ20 ప్రపంచకప్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో మాత్రం ఈ రెండు జట్లు తలపడటం విశేషం.
ఆసియా కప్ చరిత్రలో తొలి ఎడిషన్
ఆసియా కప్ తొలిసారిగా 1984లో ప్రారంభమైంది. అప్పుడు కేవలం భారత్, శ్రీలంక, పాకిస్థాన్ మాత్రమే టోర్నీలో పాల్గొన్నాయి. ఫైనల్‌కు భారత్, శ్రీలంక చేరుకున్నాయి. 1986లో భారత్ టోర్నీని బహిష్కరించింది. ఆ తర్వాత 1991లో పాకిస్థాన్ ఆడలేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఫైనల్‌లో తలపడలేదు. భారత్ 11 సార్లు టైటిల్ పోరుకు వచ్చినా, పాకిస్థాన్ మాత్రం రాలేదు. భారత్ తర్వాత శ్రీలంక అత్యధికంగా ఆరుసార్లు టైటిల్‌ను గెలుచుకుంది.
